04-07-2025 12:53:03 AM
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, జులై 3 (విజయక్రాంతి): రాష్ట్రానికి రోజు లక్షల మెట్రి క్ టన్నుల కూరగాయలు దిగుమతి అవుతున్నాయని, వాటిని తగ్గించాలంటే రాష్ర్టంలో ఉద్యానవన పంటల సాగు పెరగాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో కమిషన్ సభ్యులు భవానిరెడ్డి, గంగాధర్, చెవిటి వెంకన్న యాదవ్‌లతో కలిసి ఉద్యానవన శాఖ అధికా రులతో సమావేశమై పంటల సాగు విస్తీర్ణం పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉద్యానవన శాఖలో ఉద్యోగుల కొరత, కూరగాయల సాగు చేసే రైతులకు ఎదురవు తున్న సమస్యలపై అధికారులు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీ కాకపోవ డం, పనిభారం పెరిగిన విషయాలను వివరించారు.
రాష్ర్టవ్యాప్తంగా 60 మంది హర్టికల్చర్ అధికా రులే ఉన్నారని, దీంతో రైతులకు ఉద్యానవన పంటలసాగుపై అవగాహన కల్పించలేకపోతు న్నట్టు కమిష న్‌కు తెలిపారు. సమావేశంలో ఉద్యనశాఖ అధికారుల సంఘం నేతలు సందీప్, విద్యాసాగర్, పట్టు పరిశ్రమ నుంచి శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు.