04-07-2025 12:54:26 AM
ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు
మేడ్చల్ అర్బన్, జూలై 3: గుండ్లపోచంపల్లి పురపాలికలోని పలు వాణిజ్య వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్ పొం దకుండానే యేదేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం ట్రేడ్ లైసెన్సులు పొందిన తరువాతే వ్యాపారం చేయాల్సి ఉండగా ఆ నిబంధనలు భేకాతర్ చేస్తూ రూపాయలు లక్షల్లో వ్యాపారం చేసుకుం టూ పబ్బం గడుపుతున్నాయి.
ఇదే అంశంపై దృష్టి సాధించాల్సిన సంబంధిత మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక పట్టణ ప్రజలు ఆ రోపణలు వినబడుతున్నాయి. నిబంధనలు పాటించకుండా ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వాణిజ్య సంస్థలకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.