బాలబాలికల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య
మంచిర్యాల, జూన్ 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు బాలబాలికల చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి యా దయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ ప్రాధాన్యతను అందరికీ వివరించారు.
ప్రపంచం వేగంగా మారుతోందని, ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేయడానికి, అమాయక బాల బాలికలను, యువతీ యువకులను వలలో వేసుకోవడానికి, వివిధ రకాలుగా వేధింపులకు గురి చేయడానికి, మోసం చేయడానికి నేరగాళ్లు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారని, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ ట్రాఫికింగ్ తదితరాలు నేడు ఒక వ్యవస్థ పూరిత నేరాలుగా మారాయన్నారు.
ఉన్నత స్థాయి నుంచి నిరక్షరాస్యుల వరకు ఎవరైనా వీటి బారిన పడవచ్చునని, అందుకే ఇలాంటి మోసాల నుంచి విద్యార్థులను రక్షించడం కోసం, చైతన్యవంతులను చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాన్ని ప్రజ్వల ఫౌండేషన్ సహకారంతో అందించ డం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణకు కేజీబీవీ, మోడల్ స్కూల్, యుఆర్‌ఎస్, టిఎస్‌ఆర్‌ఐఎస్ పాఠశాలల నుంచి ఇద్దరు చొప్పున హాజరైన ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. బాలబాలికలు, యువతీ యు వకులు, మహిళల చట్టాల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోని విద్యార్థులను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలని, తల్లిదండ్రుల సమావేశాలు, గ్రామసభల్లో ఇలాంటి విషయాలు విస్తృతంగా చర్చించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్, కోర్స్ కో ఆర్డినేటర్ యశోదర, క్వాలిటీ కో ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ప్రజ్వల్ స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన శిక్షణ నిర్వాహకులు సిరాజ్, అనిల్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






