17 May, 2026 | 5:00 AM

కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

21-06-2024 12:10 AM

సంగారెడ్డి ఎస్పీ రూపేష్

సంగారెడ్డి, జూన్ 20 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని, వీటిపై ఎస్‌హెచ్‌వోలు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ చెన్నూర్ రూపేష్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొత్త చట్టాలపై వివరించారు. ఫిర్యాదులపై ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి, అరెస్టు వాంగ్మూలం నమోదు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఛార్జ్‌షీట్ ఎలా తయారు చేయాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో ఉన్న మార్పుల గురించి తెలుసుకోవాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ.. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు కొత్త చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు సత్యయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎస్‌బీ సీఐ శివలింగం, డీసీఆర్‌బీ సీఐ రమేశ్, ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.