17 May, 2026 | 5:50 AM

వేతనాలు వెంటనే చెల్లించాలి

21-06-2024 12:10 AM

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

మెదక్, జూన్ 20 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. 8 నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మల్టీపర్పస్ పని విధానం రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పనులు ఆపేస్తామని పేర్కొన్నారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బాలమణితో పాటు సత్తయ్య, నాగరాజు, రాజు, మహేశ్, ఇందిర తదితరు లు పాల్గొన్నారు.