calender_icon.png 16 December, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముడోది మనదే

15-12-2025 12:00:00 AM

* రెండో టీ20లో బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం పాలైన టీమిండియా ధర్మశాలలో బౌన్స్‌బ్యాక్ ఇచ్చింది. ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకుంటూ చెలరేగిపోయింది. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడితే.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు అభిషేక్, గిల్ మెరుపులతో వార్ వన్‌సైడ్‌గా మారిపోయింది. గిల్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు పెద్ద రిలీఫ్. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

  1. ధర్మశాలలో భారత్ ఆల్‌రౌండ్ షో
  2. సౌతాఫ్రికాపై ఘనవిజయం
  3. సమిష్టిగా రాణించిన బౌలర్లు
  4. బ్యాటింగ్‌లో అభిషేక్, గిల్ మెరుపులు

ధర్మశాల, డిసెంబర్ 14 : గత మ్యాచ్‌లో ఓటమో.. మరే కారణం వల్లనో తెలీదు కానీ మూడో టీ ట్వంటీకి భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. స్టార్ పేసర్ బుమ్రా, అక్షర్ పటేల్ స్థానాల్లో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ ఫైనల్ ఎలెవెన్‌లోకి వచ్చారు. టాస్ గెలిచిన సూర్యకుమార్ మరో మాట లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండో టీ ట్వంటీలో భారీస్కోర్ చేసిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. భారత పేసర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరిగారు.

హోంగ్రౌండ్‌లో భారీ గా పరుగులు ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్న అర్షదీప్ సింగ్‌తో పాటు బుమ్రా ప్లేస్‌లో వచ్చిన హర్షిత్ రాణా ఆరంభంలోనే సఫారీలను దెబ్బకొట్టారు. కేవలం 7 పరుగులకే సౌతాఫ్రికా జట్టులోని ము గ్గురు కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపించారు. డికాక్(1), హెండ్రిక్స్(0), బ్రెవిస్(2) పరుగులకే ఔటవగా.. కెప్టెన్ మార్క్మ్ ఒంటరి పోరాటం చేశాడు. అటు హార్థిక్ పాండ్యా, దూబే కూడా కీలక వికెట్లు తీశారు. దీంతో సౌతాఫ్రికా కోలుకోలేకపోయింది.

మార్క్మ్ పోరాడుతున్నా మిగిలిన బ్యాటర్లను భారత స్పిన్నర్లు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ , వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేయడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మార్క్మ్(్ర60) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడకుం టే కనీసం వంద కూడా దాటేది కాదు. చివర్లో ఫెరీరా(20) ధాటిగా ఆడాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు.

చివరికి సౌతాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ , హర్షిత్ రా ణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఈ సారి ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ మెరుపు ఆరంభాన్ని చ్చారు. అభిషేక్ ఇన్నింగ్స్ తొలిబంతినే భారీ సిక్సర్ బాదా డు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు.

ఎప్పటిలానే దూకుడుగా ఆడిన అభిషేక్ 18 బంతుల్లోనే 35 (3 ఫోర్లు,3 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. గిల్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగించారు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గిల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.  తిలక్‌వర్మతో కలిసి 32 పరుగులు జోడించాడు. గిల్ 28(5 ఫోర్లు) ఔటైనప్పటకీ..అప్పటికే భారత్ విజయానికి చేరువైంది. తర్వాత సూర్యకుమార్(12) ఔటైనా.. తిలక్ వర్మ, శివమ్ దూబే జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా అరుదైన రికార్డు అందుకున్నాడు. టీ ట్వంటీల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో భారత బౌలర్‌గా నిలిచా డు.అలాగే 1000 పైగా పరుగులు, 100కు పైగా సిక్సర్లు, 100 వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే వరుణ్ చక్రవర్తి టీ20ల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ ట్వంటీ లక్నో వేదికగా బుధవారం జరుగుతుంది.

స్కోర్‌బోర్డు 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 117 ఆలౌట్ (మార్క్మ్ 61, ఫెరీరా 20; అర్షదీప్ 2/13, హర్షిత్ రాణా 2/34, కుల్దీప్ 2/12 , వరుణ్ చక్రవర్తి 2/11 )

భారత్ ఇన్నింగ్స్  : 120/3 (15.5 ఓవర్లు) ( అభిషేక్ శర్మ 35, గిల్ 28, తిలక్ వర్మ 25 ; బోస్చ్ 1/18, ఎంగిడి 1/23, యెన్సన్ 1/24)