calender_icon.png 1 October, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధాలతో కాంగ్రెస్ పాలన

01-10-2025 02:12:57 AM

  1. జీవోతో అయితే అసెంబ్లీలో బిల్లు ఎందుకు!
  2.   9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు బీఆర్‌ఎస్ సహకరిస్తుంది: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోందని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ప్రజలను కొన్ని సా ర్లు మోసం చేయొచ్చు.. అన్నిసార్లు మోసం చేయలేరని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అదే మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, రిజర్వేషన్ల పెంపుపై ఈ ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.

ప్రభు త్వం వచ్చిన ఆరునెలలలోపే రిజర్వేషన్లు పెంచుతామని అప్పుడే ఎందుకు జీవో తేలేదని ప్రశ్నించారు. జీవోతో రిజర్వేషన్లు అమ లైతే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం, గవర్నర్, రాష్ర్టపతి అనుమతి ఎందుకని ప్రశ్నించారు. జీవో తెచ్చినట్టే తెచ్చి కోర్టులో కేసులు వేయించారని, కోర్టులో కేసు ఉన్నా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. ఈ జీవో చెల్లదని వారి ఆత్మసాక్షికి తెలియదా, ఇతర రాష్ట్రాల్లో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచితే కోర్టులు కొట్టేశాయని ఈ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో బిల్లును ఆమోదించి ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని ఎందు కు తీసుకెళ్లలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్రలో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచి, స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే సుప్రీం కోర్టు మొత్తం ఎన్ని కల ప్రక్రియను కొట్టేసిందని, అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో తీసుకురాదలుచుకున్నారా అని నిలదీశారు. ఆర్థికంగా వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎన్నికల్లో గెలిచిన వారి పరిస్థితి కోర్టు కొట్టేస్తే ఏమిటన్నారు.

బీసీలను ఈ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీయించాలనుకుంటుందా అని ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్ తెలివి లేనివాళ్లుగా భావోస్తుందా, ఎన్నికల్లో గెలిచిన బీసీల పదవులు రద్దయితే వారికి ఉన్నత పదవులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తుందా అని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో తెలంగాణ బీసీలకు ఏదో చేశామని చెబుతూ కాంగ్రెస్ అక్కడి ప్రజలను మోసం చేస్తోందన్నారు.

విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు జీవో ఎందుకు జారీ చేయలేదని పేర్కొన్నారు. 9 షెడ్యూల్‌లో చేర్చినప్పుడే బీసీ రిజర్వేషన్ల పెంపు నకు చట్టబద్ధత వస్తుంది తప్ప ఇంకో మార్గం లేదని స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కాంగ్రెస్ ఏ ప్రయత్నం చేసినా బీఆర్‌ఎస్ సహకరిస్తుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వే షన్లకు అనుగుణంగా కాంగ్రెస్ క్యాబినెట్‌లో, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు జరగాలని డిమాండ్ చేశారు.