15-09-2025 06:16:56 PM
మందమర్రి,(విజయక్రాంతి): మాతా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, హైదరాబాద్ కు చెందిన వైద్యులు విశ్వనాథ మహర్షి ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ వైద్య శిబిరంను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సింగరేణి యాజమాన్యం కోరింది.