calender_icon.png 15 September, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్లను అందించాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

15-09-2025 06:14:27 PM

ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్

తిమ్మాపూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లను అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తిమ్మాపూర్ మండలం కేంద్రంలో గల తాసిల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు వితంతువులు అర్హులైన పెన్షన్ దారులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వికలాంగులకు 6000 వృద్ధులు వితంతువులు, ఒంటరి మహిళ, నేత, గీత, బీడీ, ఇతర పింఛన్దారులకు 4000 అందిస్తామని చెప్పి అధికారం చేపట్టి నాటి నుంచి పట్టించుకున్న నాథుడేలేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో అర్హులైన నూతన పెన్షన్ దారులు దరఖాస్తు  చేసుకున్న వారి కూడా ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ దార్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ రాకేష్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంద రాజు, కొమ్ము సంపత్, అలవాల సంపత్, లతోపాటు మహిళలు, నాయకులు, పాల్గొన్నారు.