calender_icon.png 15 September, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గ్రామాలకు రోడ్డు వేయాలి

15-09-2025 06:19:24 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని ఎనోలి, కొలంగుడా గిరిజన గ్రామాలకు రోడ్డు మంజూరు అయినప్పటికీ అధికారుల అలసత్వం వలన నేటికి పూర్తి కాలేదని సిపిఎం పార్టీ కౌన్సిల్ సభ్యుడు దుర్గం దినకర్ ఆరోపించారు.సోమవారం గిరిజనులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు బాగు చేసి రాకపోకలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి సమస్య గంటలో పరిష్కారం కావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.