అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ప్రథమ వార్షికోత్సవం అంత్యంత వైభవంగా కేరళ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ మే కల హనుమంతరావు మాట్లాడుతూ.. ఉత్తరా నక్షత్రం అయ్యప్పస్వామి పుట్టినరోజుతో పాటుగా నక్షత్రం ప్రకారం ప్రతిష్ఠా దినోత్సవం కలిసిరావడంతో వందలాది మంది భక్తులు స్వామివారి ని దర్శించుకొని పంచామృతాభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు.
తంత్రి బ్రహ్మశ్రీ తక్కేకోరమంగళం దామోదరన్ నంబూత్రి కేరళ నుంచి విచ్చేసి ఆచారవర్ణం, స్థలశుద్ధి, వాస్తు హోమం ప్రసాద పూజ నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు దేవాలయంలోని పంచలోహ పదునెట్టాంబడిపై కేరళ సంప్రదాయంతో తాంత్రిక పద్ధతిలో పడిపూజ నిర్వహించినట్లు తెలిపారు.
గురువారం ఉదయం సుదర్శన హోమం అనంతరం కలిస పూజ నిర్వహించ నున్నట్లు ఆలయ పూజారి కురువక్కడ నారాయణన్ నంబూత్రి తెలిపారు. ఈ వేడుకలో ఉపాధ్యక్షులు ఆలస్యం నారాయణరావు, పొన్నం వీరవసంతకుమార్, వెంపటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి అట్లూరి మధు, సహాయ కార్యదర్శులు టివి పుల్లంరాజు, వేజండ్ల రవీంద్రబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సరిపూడి నాగేశ్వర రావు పాల్గొన్నారు.




