05-11-2025 06:44:25 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప ఆలయ నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణస్వీకారం బుధవారం ఆలయ పెద్దలు కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. నూతన ఆలయ కమిటీ అధ్యక్షునిగా అర్షపల్లి సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సిద్ధి మహేష్, ఉపాధ్యక్షులుగా శంకర్ గౌడ్ మోహన్ రెడ్డి సహాయ కార్యదర్శిలుగా ప్రభాకర్ చారి మట్ట సాయిలు, కోశాధికారిగా ధనగారి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఆనంద్ రాజేశ్వర్ గౌడ్ అరవింద్ సురేష్ మధుసూదన్ రెడ్డి సతీష్ సాయిలు రవికుమార్ రామకృష్ణ కృష్ణ శేఖర్ గౌడ్ నరేష్ చారి లు ప్రమాణస్వీకారం చేపట్టారు. వీరికి ఆలయ ధర్మకర్త బెజగం శంకర్ గురుస్వామి ఆలయ కమిటీ సభ్యులు గురు స్వాములు తదితరులు పాల్గొన్నారు.