calender_icon.png 5 November, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాలలో గొర్రెలు చోరీ..

05-11-2025 06:47:12 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంకటాపురంలో గొర్రెలు చోరీకి గురయ్యాయి. బాధితుడు చిర్రబోయిన శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం రోజువారీగా తనకున్న 16 గొర్రెలను మేపడానికి అడవికి తీసుకెళ్లి అదేరోజు సాయంత్రం 6 గంటలకు వెంకటాపురం వద్ద ఉన్న తన గొర్రెల షెడ్డులో పంపాడు. తెల్లవారుజామున తన గొర్రెలను గొర్రెలను మేపడానికి షెడ్డు దగ్గరికి వెళ్లి చూసేసరికి తన 16 గొర్రెలలో 4 గొర్రెపిల్లలు, 4 పెద్ద గొర్రెలను మొత్తం 8 గొర్రెలు కనిపించకుండా పోయాయని, సుమారు వాటి విలువ 80000 వరకు ఉంటుందని తెలిపాడు. శ్రీరాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తనకు ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని చిరబోయిన శ్రీరాములు వేడుకున్నాడు.