calender_icon.png 24 November, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి మృతికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి..

24-11-2025 04:38:13 PM

గురుకుల పాఠశాల ముందు విద్యార్థి సంఘాల ధర్నా...

బాన్సువాడ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండలం మైనారిటీ గురుకులం పాఠశాలలో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పిడిఎస్యు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకుని విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురుకుల పాఠశాల ముందు విద్యార్థి సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. బాధ్యులను శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రధాన గేటు ముందు బైఠాయించి గురుకుల నిర్వాహకుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో తమ పిల్లలకు ఉన్నతమైన విద్య అందుతుందని చేర్పిస్తే, వారి తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తున్నారని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలనుండి గురుకులాల్లో అనేక సార్లు విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం హాస్టల్ లో ఉన్నటువంటి సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం అర్ధరాత్రి చందూర్ మండలంలో  జరిగిన సంఘటన కారణమని బాలరాజు వెల్లడించారు. రాత్రి పూట నైట్ డ్యూటీలో ఉంటున్నటువంటి హాస్టల్ వార్డెన్స్ విద్యార్థులు ఎమ్ చేస్తున్నారో కూడా చూసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ వార్డెన్స్ కూడా 11 గంటలకే పడుకొని తెల్లవారుజామున నిద్ర లేస్తున్నారు. సమగ్ర విచారణ జరపాలనీ,విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం చేయాలనీ, హాస్టల్ సిబ్బందిపై చర్యలు తక్షణమే తీసుకోవాలని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు డి. నాగరాజు నాయకులు రాజన్న, జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్, జిల్లా కన్వీనర్ బాలకృష్ణ వినయ్, వర్ని నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.