calender_icon.png 24 November, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మేంద్ర మృతి పట్ల సీఎం సంతాపం

24-11-2025 04:31:51 PM

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక దిగ్గజ వ్యక్తి అయిన ధర్మేంద్ర జీ మరణం తీవ్ర బాధాకరం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట నటుడిని కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. మరణించిన ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర దుఃఖ సమయంలో ధర్మేంద్రజీ కుటుంబ సభ్యులకు, ఆయన స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు. 

గతకొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ధర్మేంద్ర సోమవారం ముంబాయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నవంబర్ 10న, ధర్మేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల తరువాత, కుటుంబం ఇంటి చికిత్సను ఎంచుకోవడంతో ధర్మేంద్ర ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ముంబయిలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖలు హాజరు కానున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.