అయ్యప్ప ఆలయ చోరీ నిందితునికి 16 నెలల జైలుశిక్ష
కామారెడ్డి, మే 14 (విజయక్రాంతి) : అయ్యప్ప ఆలయంలో హుండీని దొంగలించిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 16 నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం ఎల్లారెడ్డి కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సుష్మ తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీన తేదీన ఎల్లారెడ్డి కి చెందినఒంటరి కృష్ణారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయంలో గల గర్భగుడి హుండీ తాళం పగలగొట్టి డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పరిశోధనలో భాగంగా అయ్యప్ప స్వామి టెంపుల్ పూజారిని, గ్రామస్తులను విచారించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆలయములో చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కేమరాలను పరిశీలించగ వచ్చిన ఆధారాల ను సేకరించి పాత నేరస్తుల కదలికల ద్వారా పోసనపల్లి గ్రామానికి చెందిన జంగ అలియాస్ జంగం నర్సింలు ను నేరస్థునిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఈ కేసు విషయములో నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేశారు. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం తో ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి యం. సుష్మ నిదితునికి 16 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన ఎస్సు మహేష్ ,ఎల్లారెడ్డి కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సు రాజయ్య, ఏఎస్సు రామేశ్వర్ రెడ్డి, బి నరేందర్ లను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.






