18 April, 2026 | 3:44 AM

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులు

15-05-2025 12:39 AM

ఆర్మూర్, మే 14 : పహల్గాం ఉగ్ర దాడిలో అమరులైన పౌరులకు, యుద్ధంలో మృతి చెందిన సైనికులు, పౌరులకు ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నివాళులు అర్పించారు. బుధవారం బార్ అసోసియేషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పహాల్గామ్ లో జరిగినటువంటి ఘోర సంఘటన తర్వాత పాకిస్తాన్ జరిపినటువంటి సీజ్ ఫైర్ లో అదేవిధంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల సందర్భంగా జరిగిన యుద్ధంలో వీరమరణం పొందినటువంటి అమర వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించడమైనది.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, మాజీ అధ్యక్షుడు పండిత్ కృష్ణ, చిలుక కిష్టయ్య, విప్లవ్ కిరణ్, న్యాయవాదులు బండారి నర్సయ్య, బేతు జగదీష్, వెంకట్రావు షిండే, ఐనారి అశోక్, మామిడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.