గురుకుల ఫలితాల్లో ఆజాద్ జయభేరి
35 మంది పరీక్ష రాస్తే 34 మందికి సీట్లు
హర్షం వ్యక్తం చేసిన ఆజాద్ యాజమాన్యం
కోచింగ్ సెంటర్లో మిన్నంటిన సంబరాలు
కూసుమంచి, మార్చి24 (విజయ క్రాంతి) : గురుకు పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశ ఫలితాల్లో కూసుమంచి కేంద్రంలో నిర్వహించబడుతున్న ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు కోచింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ అకడమిక్ డీన్ అజహరుద్దీన్ మహ్మద్ తెలిపారు. గతనెలలో వెలువడిన నవోదయ ఫలితాలలో 24 సీట్లు సాధించిన ఆనందం మరువక ముందే మంగళవారం విడుదలైన ఫలితాలలో తమ కోచింగ్ సెంటర్ నందు చదువుతున్న 35మంది విద్యార్థులలో 34మంది సీట్లు సాధించి తమ విద్యార్థులు జయభేరి మోగించి జయహో ఆజాద్ అని చాటి చెప్పారని తెలిపారు.
ప్రముఖ పాఠశాలల్లో సీట్లు కైవసం..
తమ కోచింగ్ సెంటర్ నందు శిక్షణ పొందిన 35మంది విద్యార్థులకు 34 మంది రాష్ట్రంలోని ప్రముఖ గురుకుల పాఠశాలలైన సర్వేల్, చౌటుప్పల్, ఏన్కూర్, బూర్గంపహాడ్, వైరా, ముదిగొండ, రఘునాథపాలెం తదితర గురుకులాలలో సీటు సాధించడంతో పాఠశాల ఆవరణంలో మిఠాయిలు పంచుకుని, పటాకులు కాల్చి తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ యాజమాన్యం, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీన్ అజహరుద్దీన్ మాట్లాడుతూ ఈ ఘనతకు కారణమైన తమ పాఠశాలలో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు ఫణంగా పెట్టి మాకు అప్పగించిన తల్లిదండ్రులకు వినమ్రంగా అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.
ఈ విజయం వెనుక విద్యార్థుల కఠోర శ్రమ, యాజమాన్యం అకుంఠిత కార్యదక్షత తోడైతేనే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. ఈ విజయ పరంపర రాబోయే విద్యాసంవత్సరానికి కూడా ఇలాగే కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం చేసి, బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో డీన్ అజహరుద్దీన్ మహమ్మద్, డైరెక్టర్లు ఆజాద్, సబిహా, సయ్యద్ మియా, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




