calender_icon.png 17 January, 2026 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐరాస అంతర్జాతీయ జల సదస్సుకు బీ పృథ్వీ రామ్

17-01-2026 03:42:09 AM

ముషీరాబాద్, జనవరి 16 (విజయ క్రాంతి):  ఐక్యరాజ్య సమితి (ఐరాస)అంతర్జాతీయ జల సద స్సు కు హైదరాబాద్ కు చెందిన వ్యవసాయ-జల నిపుణుడు బొమ్మర బోయిన పృథ్వి రామ్‌కు ఆహ్వానం అందిం ది. ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఐ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ జల సదస్సు ఈనెల 26, 27 తేదీల్లో పశ్చిమ ఆఫ్రికా దేశంలోని సెనగల్ రాష్ట్ర రాజధాని డకార్ లో జరగనుంది.

నీటి భద్రత వాతావరణ మా ర్పులు,  వ్యవసాయ రంగం అభివృద్ధి వ్యవస్థల మధ్య అనుసంధానంపై పృధ్వీరామ్ చేస్తు న్న కృషిని గుర్తించిన యునైటెడ్ నేష న్స్ ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈనెల 26, 27 తేదీల్లో జరిగే ఈ ఐరాస సదస్సును  ఏర్పా టు చేసినట్లు ఆయన చెప్పారు.