17-01-2026 03:42:04 AM
కుషాయిగూడ, జనవరి16 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్‌ఐ ఏ అరెస్టుతో ప్రస్తుతం జైలులో ఉన్న గాదె ఇన్నారెడ్డి అలియాస్ ఇన్నయ్యకి తీవ్ర విషాదం ఎదురైంది. ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా జాఫర్‌గడ్ మండలం గుంటూరువారి పల్లి లో కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా ఆమె మంచానికే పరిమితమయ్యారు. కు మారుడిని చివరిసారి చూడకుండానే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలి పారు. తల్లి మరణ వార్త జైల్లో ఉన్న కుమారుడికి చేరడంతో ఆయన తీవ్రంగా కలత చెందినట్లు సమాచారం.
థెరిసమ్మ మృతితో మానవీయ కోణంలో పేరోల్‌పై వెంటనే ఇన్నయ్యను విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ఇన్నారెడ్డి అరెస్టు తర్వాత కుటుంబం మొత్తం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని బంధువులు చెబుతున్నారు. ఒకవైపు చట్టపరమైన పోరాటం, మరోవైపు తల్లి మరణం ఈ రెండు సంఘటనలు కు టుంబాన్ని కుదిపేశాయి. తల్లి మరణం ఇన్నారెడ్డి కుటుంబంలో తీరని లోటుగా మిగిలిం ది. జైలు అధికారులను వివరణ కోరగా కో ర్టు నుంచి అనుమతి వస్తే తల్లి అంతక్రియలకు పంపిస్తామని మీడియాతో చెబుతున్నారు.
48 గంటల తాత్కాలిక బెయిల్
గాదె ఇన్నయ్యకు కోర్టు బెయిల్ మంజూ రు చేసింది. శుక్రవారం షరతులతో కూడిన 48 గంటల తాత్కాలిక బెయిల్‌ను ఆయనకు కోర్టు మంజూరు చేసింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన విడుదల కాను న్నారు. శనివారం జనగామ జిల్లాలోని జాఫర్‌గడ్ మండలం సాగరంలో ఇన్నయ్య తల్లి అంత్యక్రియలు జరగనుండగా ఆయన పాల్గొననున్నారు.