calender_icon.png 17 January, 2026 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత ప్రమాణాలను విధిగా పాటించాలి

17-01-2026 03:43:23 AM

బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్ తిరుపతి రాజు 

సికింద్రాబాద్ జనవరి 16 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే అరైవ్ అలైవ్ భాగంగా శుక్రవారం బోయిన్ పల్లి నేషనల్ పాయింట్ వద్ద రోడ్డు భద్రత అవగాహన నిర్వహించారు. ఈకార్యక్రమానికి  ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం.కిరణ్ నందిత  హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు,యూనియన్ నాయకులతో రహదారి భద్రత పై ప్రతిజ్ఞ  చేయించారు. అనంతరం ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు మాట్లాడుతూపౌరుల పరివర్తన, పౌర సమాజ అవగాహన రోడ్డు భద్రతలో కీలకమని అన్నారు. వాహనం కలిగియున్న ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు, ఫిట్నెస్ పర్మిట్, పొల్యుషన్ చెక్, ఇన్షూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, తెలిపారు.

మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు హెల్మెట్ స్ట్రాప్ ఫిక్స్ చేసుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన  మన కుటుంబాలకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని,సెల్ ఫోన్ డ్రైవింగ్,డ్రంక్ & డ్రైవ్, రాంగ్ లేన్  డ్రైవింగ్ చేయడం వల్ల  జరిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూని యన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బక్రి,సైబరాబాద్ అధ్యక్షుడుషేక్ మజీద్, బోయిన్ పల్లి అధ్యక్షుడుమహ్మద్ యాకూబ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజీజ్,వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నసీర్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆజం, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.