08-10-2025 09:00:40 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఓ విద్యార్థిని అదృష్టమైన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ మున్సిపల్ లోని ఎన్ ఎఫ్ సి నగర్ లో నివాసం ఉంటున్న సాదు రాజేష్ కుమార్ కూతురు రంగ తేజస్వి(19) ఘట్ కేసర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాల నందు చదువుతుంది. బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరి సాయంత్రం వరకు కూడ తిరిగి రాకపోవడంతో బంధుమిత్రులను ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి రాజేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.