యాదగిరిగుట్టలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నివాళులర్పించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అంబేద్కర్ విగ్రహానికి పులామాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బిరిగే రమ్యా రామచందర్, కౌన్సిలర్లు, బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముచ్చర్ల మల్లేష్ యాదవ్, పేరబోయిన సత్యనారాయణ, మెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకల హెమెందర్ గౌడ్, గుండ్లపల్లి భరత్ గౌడ్, బంధారపు బిక్షపతి గౌడ్, కాటబత్తిని ఆంజనేయులు, గుండు నరసింహ గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద శంకర్ మాదిగ, జానీ మాదిగ, మాజీ కౌన్సిలర్ సురేందర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.






