నల్లచేరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని నల్లచెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పారుతుండటంతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లచెరువు నిండడం వల్ల పట్టణంలోని ప్రధాన మురికి కాలువ పూర్తిగా ప్రక్షాళన అయిందని, స్వచ్ఛమైన కాలువగా మారుతుందని తెలిపారు. దీనివల్ల పట్టణంలో పరిశుభ్రత పెరుగుతుందని, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కలుగుతుందని పేర్కొన్నారు.
గోదావరి జనాలతో నల్లచెరువు నిండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగె రమ్య రామచందర్ కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ పెలిమిల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ ముచ్చర్ల మల్లేష్ యాదవ్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, ఎరుకల హేమేంధర్ గౌడ్, బంధారపు భిక్షపతి గౌడ్, గుండు నరసింహ గౌడ్ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.






