21-06-2025 12:18:21 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 20 (విజయ క్రాంతి) : చెడు బ్యాక్టీరియా వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని శిల్పారామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి వేస్ట్ మే నేజ్మెంట్ మీద స్టార్టప్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లో నిష్ణాతులైన వారు.
ఈరోజు ఒక రోజు సెమినార్ లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. 40 స్టార్టప్స్ వచ్చాయని, వారు చేసిన ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. పట్టణీకరణ అభివృద్ధి చెందడంతో పాటుగా నగర ప్రాంతాలలో వేస్టేజ్ కూడా అధికంగా పెరుగుతుందని ఆయన చెప్పారు . వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యము అర్బన్ వేస్టేజ్ వలన అవుతుంది అని ఆయన అన్నారు.
పెరుగుతున్న కాలుష్యం ద్వారా వివిధ రకాల చెడు బ్యాక్టీరియా లు మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయని, చిన్నపిల్లలకు కూడా వాయు, నీటి కాలుష్యం ద్వారా ఇన్ఫెక్షన్స్ కలుగుతున్నాయని ఆయన చెప్పారు. వీటిని తగ్గించుట కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్న ట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు స్టాల్స్ ను.ప్రారంభించి సందర్శించి, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంయుఐడి కమీషనర్ టికె శ్రీదేవి, జిల్లా కలె క్టర్ శ్రీమతి విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.