15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెంచేందుకే బడి బాట

09-06-2025 04:16 PM

సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకే ప్రభుత్వం బడి బాట కార్యక్రమం నిర్వహిస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని మండలం పుట్టపాక ప్రాథమిక పాఠశాల అద్వర్యంలో సోమవారం గ్రామంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు అవహగాహన కల్పించారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ పిల్లల తల్లి తండ్రుల్లో చైతన్యo తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... 'బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే ప్రభుత్వం బడిబాట నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  చేరిన విద్యార్థులకు నోట్‌బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ, తదితర వాటిని ఉచితంగా అందిస్తుంది.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు విద్యాపరంగా కృషి చేస్తున్న ఆయన ఆశయాలకనుగుణo గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారని, కావున పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రవేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఎఫ్ ఎల్ ఎన్  చాంపియన్ షిప్ అవార్డు రాగా దాన్ని కొత్త శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శేషయ్య, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, పంచాయతి కార్యదర్శి సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, సిఏలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు