26-07-2025 12:00:00 AM
కలెక్టర్ పీ.ప్రావీణ్య
జహీరాబాద్, జూలై 25 : రాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ బడి వయసు గల పిల్లలు ఎవరు బడి బయట ఉండకూడదని, అలాగే మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలలో చేర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యార్థుల పఠన సామర్థ్యం పెంపొందిం చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. పాఠశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.