calender_icon.png 27 July, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

26-07-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు

వనపర్తి టౌన్, జూలై 25 :  వనపర్తి జిల్లాలో ఈ నెల 27న జరిగే గ్రామ పరిపాలన అధికారులు, సర్వేయర్ల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెం కటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వనపర్తి జిల్లా నుండి 49 మంది వి.ఆర్. ఒ లు, వి.ఆర్. ఎ లు, 112 మంది సర్వేయర్ లు జులై 27న జరిగే పరీక్షలకు హాజ రు కానున్నారు.

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేశారు. వి.ఆర్. ఒ లు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు,అదే సర్వేయర్లకు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు తిరిగి 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

పోలీస్ శాఖ ద్వారా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డిఎస్పి వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాసులు, ఎ.డి. సర్వే బాలకృష్ణ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్, స్థానిక తహసిల్దార్ రమేష్ రెడ్డి, డి. సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.