calender_icon.png 6 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో కేసీఆరే సుప్రీం

06-09-2025 01:30:23 AM

  1. ఎప్పుడైనా పార్టీదే తుది నిర్ణయం
  2. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అద్భుతాలు
  3. నాలుగు వందల కోట్లతో మేడిగడ్డ రిపేర్ అవుతుంది
  4. లండన్‌లో ఎన్నారై నేతల మీట్ ది గ్రీట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో కేసీఆరే సుప్రీం అని, ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదేనని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు. లండన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ఎ న్నారై నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతా లు సాధించిందన్నారు.

కాళేశ్వరం అంటే లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచా రం చేస్తున్నారని, మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఏడాదిన్నర నుం చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని, వానాకాలం కరెంట్ డిమాండే ఉండదని, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని తెలిపారు. రైతుల ప్ర యోజనాలు దెబ్బ తినేలా రాజకీయాలు చే యకూడదని హితవుపలికారు.

హైడ్రాతో హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ కుప్పకూలిందని, అందుకే ఎన్నారైలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం లేదని ఆందో ళన వ్యక్తంచేశారు. తెలంగాణ గొప్ప రాష్ర్టం గా అభివృద్ధి చెందుతున్నదని కేసీఆర్ చెప్పేవారని, కానీ నేటి పాలకులే నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గతంలో తాము కూ డా చిన్నచిన్న తప్పులు చేశామని, ఇప్పుడు వాటిని సరి చేసుకుని ముందుకెళ్తున్నామని స్పష్టంచేశారు. 

ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్‌ఎస్‌దే విజయం

బెంగాల్ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే నానుడి నుంచి తెలంగాణ ఆచరి స్తుంది.. దేశం అనుసరిస్తుందనే స్థితికి రాష్ట్రాన్ని కేసీఆర్ పాలనతో తీసుకొచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ డెడికేటెడ్‌గా, ఫోకస్డ్‌గా పనిచేయడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు.

ప్రస్తుతం గ్రామపంచాయతీలో డబ్బులు రాక అప్పుల పాలయ్యామని, ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులను వివరించారు.

మూడు నుంచి నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుందని, కానీ లక్ష కోట్లు అని కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తోందన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌దే విజయమని, రాసిపెట్టుకోండని వ్యాఖ్యానించారు.