బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కామారెడ్డిలో సెలక్షన్ పూర్తి
కామారెడ్డి, జూన్7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. పలు విభాగాల్లో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడ పోటీలకు ఎంపిక చేసినట్లు కామరెడ్డి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ తెలిపారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభని కనబరిచి నట్లు తెలిపారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపి కైన వారిని మేమంతాతో సన్మానిం చారు. అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19 పురుషు లు, మహిళల విభాగం తో పాటు మాస్టర్ కేటగిరీలో 35 ప్లస్, 45 ప్లస్, 55 ప్లస్, 65 ప్లస్, కేటగిరిలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు.






