8 June, 2026 | 2:34 AM

దారి ‘బాగు’ చేసుకున్నారు..

08-06-2026 01:20 AM

మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా.. అనే కవితాసూక్తిని అక్షర సత్యం చేస్తూ.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజుల గట్టు, హరిచంద్ తండా గ్రామాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రహదారిని సొంత ఖర్చులతో బాగు చేసుకున్న ఘటన ఇది.

ఆయా గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు నిత్యం తమ పంట పొలాల వద్దకు వెళ్లే దారి పూర్తిగా పాడైపోయి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా మారిందని అనేక పర్యాయాలు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ఫలితం లేకుండా పోయిందని, దీనితో ఈ వర్షాకాలంలో కూడా తమ పరిస్థితి అదే విధంగా మారుతుందని భావించి, తలా కొంత నగదు జమ చేసుకొని సుమారు 50 వేల రూపాయలతో 150 ట్రిప్పుల మట్టి పోయించి ‘రహదారి’ని ఏర్పాటు చేసుకున్నాడు