18-10-2025 07:50:58 PM
పోలీస్ బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ..
గద్వాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ జోగులాంబ గద్వాల జిల్లా అన్ని పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఎమ్మార్పీఎస్ సంఘాలు చేపట్టిన బంధు ప్రశాంతంగా కొనసాగింది. అందులో భాగంగా ప్రజలకు ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి కష్టం గానీ అవాంఛనీయ సంఘటన గాని జరగకుండా ఏర్పాటుచేసిన పోలీస్ బందోబస్తును జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు భద్రత చర్యలు తీసుకొని ముఖ్య రహదారులు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు బస్టాండ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా గద్వాల పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు బస్టాండ్ ,ఓల్డ్ బస్టాండ్, రాజీవ్ మార్క్ తదితర ప్రాంతాలను సందర్శించి పోలీస్ ఏర్పాటను సమీక్షించారు. ఎస్పీతోపాటు, డిఎస్పి మొగిలయ్య, డిపో మేనేజర్ సునీత, సిఐ శీను ,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బంద్ కార్యక్రమం కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజేయుడు వేరువేరుగా స్థానిక నాయకులతో కలిసి బంద్ కార్యక్రమం లో పాల్గొన్నారు.