18-10-2025 07:52:07 PM
- సంపూర్ణ మద్దతు తెలిపిన వర్తక సంఘాలు
- బంద్ లో పాల్గొన్న రాజకీయ నాయకులు
మంగపేట,(విజయక్రాంతి): బీసీలకు రాజ్యాంగ బద్ధంగా రాజకీయ విద్య ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ కల్పించే విధంగా పార్లమెంటులో చట్టాలు చేసి తొమ్మిదొవ షెడ్యూల్ ప్రకారం బీసీల రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత కల్పించాలని శనివారం తలపెట్టిన బీసీ బంద్ కు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులు మెడికల్ షాపులు మినహా వర్తక సంఘాలు దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సైతం మూసి వారి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. బీసీ బంద్ కు మండలంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఉదయం నుండి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.