calender_icon.png 21 November, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు

21-11-2025 09:50:12 AM

.. వెల్కమ్ చెప్పనున్న సీఎం రేవంత్, కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు. తిరుమల శ్రీవారి సేవలో ఉన్న రాష్ట్రపతి మొక్కులు చెల్లించుకుని మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.25 వరకు రాన్ భవన్ లో రాష్ట్రపతికి భోజనం, విశ్రాంతి ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. కళా మహోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హరిబాబు, అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకవత్, రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి ముర్ము పుట్టపర్తికి వెళ్లనున్నారు.

రాష్ట్రపతి ముర్ము పర్యటన దృష్ట్యాహైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగర పర్యటన దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నవంబర్ 21-22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్, త్రిముల్గెర్రీ, బేగంపేట అంతటా అనేక జంక్షన్లలో నిర్దిష్ట సమయాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయడం, దారి మళ్లించడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నవంబర్ 21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుండి సాయంత్రం 6.45 గంటల వరకు, నవంబర్ 22న ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. అత్యవసర సమయంలో సహాయం కోసం 9010203626 నంబర్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి, తదనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ అధికారులు ప్రజలను కోరారు.