21-11-2025 09:31:37 AM
హైదరాబాద్: 2025 మహిళల 51 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టైటిల్(World Boxing Cup Finals 2025) గెలుచుకున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు(Telangana boxer Nikhat Zareen) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మీ అవిశ్రాంత కృషి, అజేయ స్ఫూర్తి భారతదేశం, తెలంగాణను గర్వపడేలా చేస్తూనే ఉన్నాయని కేటీఆర్ కొనియాడారు. పెద్ద కలలు కనే ధైర్యం ఉన్న లెక్కలేనన్ని యువతులకు నిఖత్ జరీన్ ప్రేరణ అన్న కేటీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచకప్ బాక్సింగ్ ఫైనల్స్ లో బాక్సర్ నిఖత్ జరీన్‌కు స్వర్ణం వరించింది. గ్రేటర్ నోయిడా లో జరుగుతున్న మహిళల 51 కేజీల ఫైనల్ విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచారు. ప్రపంచ బ్యాక్సింగ్ కప్ ఫైనల్లో 5-0తో గవో యీ గ్జువాన్(చైనీస్ తైపీ)ని నిఖత్ చిత్తు చేసింది. ప్రపంచకప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఫామ్ నిరూపించుకుంటూ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ జరీన్ ఎదురుదాడి చేసింది. పదునైనా పంచ్ లతో గవో యీ గ్జువాన్ పై విరుచుకుపడింది. దీంతో భారత్ ఖాతాలో మరో 8 పసిడి పతకాలు చేరాయి. 9 స్వర్ణాలు, 6 రజకాలు, 5 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.