21-11-2025 08:49:59 AM
పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానం
హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు(Telangana boxer Nikhat Zareen) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో (51 కేజీల విభాగంలో) అద్భుత ప్రతిభను ప్రదర్శించి మరోసారి ప్రపంచ వేదికపై దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటారని ప్రశంసించారు. ఈ విజయం యువతకు, యువ క్రీడాకారులకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిఖత్ జరీన్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు.
ప్రపంచకప్ బాక్సింగ్ ఫైనల్స్ లో బాక్సర్ నిఖత్ జరీన్ కు స్వర్ణం వరించింది. గ్రేటర్ నోయిడా లో జరుగుతున్న మహిళల 51 కేజీల ఫైనల్ విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచారు. ప్రపంచ బ్యాక్సింగ్ కప్ ఫైనల్లో 5-0తో గవో యీ గ్జువాన్(చైనీస్ తైపీ)ని నిఖత్ చిత్తు చేసింది. ప్రపంచకప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఫామ్ నిరూపించుకుంటూ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ జరీన్ ఎదురుదాడి చేసింది. పదునైనా పంచ్ లతో గవో యీ గ్జువాన్ పై విరుచుకుపడింది. దీంతో భారత్ ఖాతాలో మరో 8 పసిడి పతకాలు చేరాయి. 9 స్వర్ణాలు, 6 రజకాలు, 5 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.