15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కుట్రలు చేస్తే... యుద్ధం స్టార్ట్ చేస్తా

14-02-2026 01:40 PM

యుద్ధం స్టార్ట్  చేస్తా

రాసి పెట్టుకోండి.. కరీంనగర్ మేయర్ పీఠం మాదే

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు(Telangana Municipal election results ) వెలువడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడింది. దీంతో నేతలు క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) వార్నింగ్ ఇచ్చారు. రెండు పార్టీలపై విమర్శలు చేశారు.

'కరీంనగర్ మేయర్ పీఠం మాదే.. రాసి పెట్టుకోండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్దం స్టార్ట్ చేస్తా. మీకు బీజేపీ కార్యకర్తల దమ్ము, శక్తి తెలియదు" ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు బండి సంజయ్ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మేయర్ పీఠం ఎలా దక్కించుకుంటాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని ఎప్పటి నుంచో చెప్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతుందని స్పష్టం చేశారు.