14-02-2026 12:12:15 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గెలిచిన ఓడిన ప్రతి బిఆర్ఎస్ నాయకుడు కార్యకర్త ప్రజాసంక్షేమ కోసం నిరంతరం శ్రమించి పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలిచిన కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. చాలామంది 10 15 ఓట్లతో అంచులకు చేరడం జరిగిందని కేవలం అధికార దుర్వినియోగం వల్లనే మాత్రమే కొన్నిచోట్ల బీఆర్ఎస్ ఓటమి జరిగిందన్నారు. అధికార దుర్వినియోగం అత్యధికంగా చేశారని ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదని భయపెట్టి ఓట్లు పించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలమూరు కార్పొరేషన్(Palamuru Corporation)లో పెండింగ్లో ఉన్న పనులను చేసే బాధ్యత కార్పొరేటర్లు అందరూ తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇసుక వ్యాపారంతో పాటు ఏ వ్యాపారాన్ని కూడా అధికార పార్టీ వదలడం లేదని ఇలా అబ్బాయి పెట్టి ఎన్నాళ్ళు ఉంటారు చూస్తామని, అవినీతి అక్రమాలపై తమ పోరాటం ఎల్లప్పుడూ ఉంటుందని హెచ్చరించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఒకసారి ఆలోచించాలని ఇది సరైన పద్ధతి కాదన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించేందుకు తమ జీవన తీసుకురావడం జరిగిందని అదే జీవోను మరోసారి తీసుకువచ్చి మేమే ఆపడం తీసుకొచ్చేమని చెబుతున్నారని తెలిపారు. రైతు బజార్లో ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను ఇతర అవసరాలకు ఉపయోగించుకోకూడదని ఏ పనికి సంబంధించి ఆడిషన్ ఉంటుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. 15 మంది పార్టీ సింబల్ నుంచి గెలవగా మరొకరు పార్టీ రెబల్ అభ్యర్థి గెలిచి పార్టీలోనే ఉంటున్నానని ముందుకు రావడం జరిగిందన్నారు. ఓటింగ్ శాతం కేవలం ఐదు శాతం మాత్రమే వేదం ఉందని బిఆర్ఎస్ వైపు ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మకంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.