calender_icon.png 20 December, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహనలో హ్యాండ్ బాల్ సెలక్షన్స్

20-12-2025 12:08:20 AM

కరింనగర్ క్రైం, డిసెంబర్19(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయ హ్యాండ్ బాల్ ఎంపికలు జరిగాయి. మార్చ్ 17 నుండి 21 వరకు వి ఐ టి, వెళ్ళొర్ లొ పోటీలు జరగనున్నాయి.ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ స్పో రట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మునావర్ మాట్లాడుతూ అంతర విశ్వవిద్యాలయ పోటీలు ప్రతిష్టాత్మకమైనవని, వీటిలో బహుమతులు గెలుచుకుంటే పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని విశ్వవిద్యాలయ పరిధిలోని క్రీడాకారులు తమ శక్తి మేరకు శ్రమించి పోటీలలో ప్రతిభ చాటి విశ్వవిద్యాలయానికి పేరు ను తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ స్పోరట్స్ కోఆర్డినేటర్ డా.కృష్ణకుమార్, పిడి విజయకుమార్, డా. మనోజ్ కుమార్ వివి ధ కళాశాలల వ్యాయామ అధికారులు హ్యాం డ్ బాల్ కోచ్ లు వెంకటేష్, శ్రీనాథ్, అమరేందర్ వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు.