calender_icon.png 3 December, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు లొంగుబాటు

03-12-2025 12:55:18 AM

జనగామ డీసీపీ ఎదుట సరెండర్

మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళంలో పనిచేసిన లోకేటి రమేష్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఎదుట లొంగిపోయారు. కామారెడ్డి జిల్లా ఇస్రోజీ వాడకు చెందిన లోకేటి రమేష్ ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వెస్ట్ సభ్యునల్ బ్యూరో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

2005లో తన సోదరి లావణ్యతో పార్టీలో చేరిన ఆయన మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రకటన నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ తెలుసుకుని తాను కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. రమేష్ పై ఎనిమిది లక్షల రివార్డు ఉంది. తక్షణ సాయంగా రూ.25 వేల చెక్కును పోలీసులు అందజేశారు. మిగిలిన డబ్బులు త్వరలో డిడి రూపంలో అందజేస్తామని డీసీపీ తెలిపారు.