సిపిఐ పట్టణ కార్యదర్శిగా బాస శ్రీనివాస్..
29-06-2025 | 07:40pm
ఇల్లెందు (విజయక్రాంతి): సిపిఐ ఇల్లందు పట్టణ కార్యదర్శిగా ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాస శ్రీనివాస్ ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక 24 ఏరియాలోని కమ్యూనిటీ హాల్ లో జరిగిన సిపిఐ 18వ పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభల్లో పట్టణ కార్యదర్శిగా బాస శ్రీనివాస్ ను ఎన్నుకున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా(CPI District Secretary Sabir Pasha) తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సిపిఐ పట్టణ కార్యదర్శి భాస శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వారికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.






