30-08-2024 01:47:40 AM
నిర్మల్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లా బాసర సర స్వతి అమ్మవారి ఆలయం హుండీ లెకింపు కార్యక్రమం గురువారం అధికారులు నిర్వహించారు. శ్రావణ మాసం ముగియనుండటంతో మొత్తం 79 రోజుల ఆదాయాన్ని హుండీ లెక్కించగా మొత్తం రూ.99,17,200 వచ్చినట్టు అధికారులు తెలిపారు.116 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కేజీల వెండి, 35 విదేశీ కరెన్సీ వచ్చినట్టు వివరించారు.