calender_icon.png 25 January, 2026 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ హయాంలోనే చెరువుల ఆక్రమణ

30-08-2024 01:47:32 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలోనే చెరువుల ఆక్రమణ జరిగిందని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో మాట్లాడుతూ చిట్ చాట్ పేరుతో హరీశ్ రావు సోదీ చాట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో చెరువులు, నాలాలను ఎందుకు రక్షించలేదని,  హైడ్రా ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన నిలదీశారు. రుణమాఫీతో సీఎం రేవంత్‌రెడ్డి అందరి గుండెల్లో నిలిచిపోయారన్నా రు.

సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న మంచి పనులను బీఆర్‌ఎస్ ఓర్చుకోవడం లేదన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటును అడ్డుకుంటామంటే సరికాదన్నారు. అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి సోదరు డికి కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. మంత్రి పొంగులేటి నివాసం కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చండని చెప్పారని ఆయన గుర్తు చేశారు. హైడ్రాపై బీజేపీ నేతలు అవగాహణ పెంచుకోవాలన్నారు.