calender_icon.png 25 January, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరంగం వెంచర్ యజమానికి నోటీసులు

30-08-2024 01:49:06 AM

చెరువులను సందర్శించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు

మంచిర్యాల, ఆగస్టు 29 (విజయక్రాంతి): చెరువుల ఆక్రమణలపై విజయక్రాంతి దినపత్రికలో గురువారం ప్రచురితమైన ‘శ్రీరంగం వెంచర్.. పొంచి ఉన్న డేంజర్’ కథనానికి అధికారులు స్పందించారు. గురు వారం మంచిర్యాల ఇరిగేషన్ ఏఈ గౌతమ్, తహసీల్దార్ రహ్ఫతుల్లా హుస్సేన్, ఆర్‌ఐ అజీజ్ చిన్నకుంట చెరువు కట్ట మీద, పెద్దకుంట చెరువు మధ్యలో నుంచి ‘శ్రీరంగం హీల్స్’ వేసిన కంకర రోడ్డును పరిశీలించారు. ‘విజయక్రాంతి’తో ఇరిగేషన్ ఏఈ మాట్లాడుతూ చెరువు కట్టపై ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డు వేశారని, చట్ట ప్రకారం అలా వేయరాదని, గతంలో హెచ్చరించామని, నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చెరువులను, కుంటలను కబ్జా చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.