calender_icon.png 8 January, 2026 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేవియార్డ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

06-01-2026 12:00:00 AM

సికింద్రాబాద్, జనవరి 5 (విజయకాంతి): ఓల్డ్ బోయిన్‌పల్లి 119 డివిజన్ ముస్లిం గ్రేవియార్డ్ కమిటీ సభ్యులు నూతన సంవత్సరం సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్‌ని కలిసి పూల బొకే, శాలువాతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు గ్రేవియార్డ్ కమిటీ సభ్యులు రాబో యే పవిత్ర షబే మెరాజ్ సందర్భంగా గ్రేవియార్డ్‌లో మౌలిక సదుపాయాలను తక్షణమే మెరుగుపరచాలని కమిటీ సభ్యులు కార్పొరేటర్ నరసింహయాదవ్‌ను కోరారు. అనంత రం సంబంధిత అధికారులకు క్లీనింగ్, లైటింగ్, సదుపాయాలు  ఏర్పాటు చేయాలని కార్పొరేటర్  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రేవియార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.