06-01-2026 12:00:00 AM
తెలంగాణ హ్యాండీక్రాఫట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ
ముషీరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): చేనేత తో పాటు చేతివృత్తులను కాపాడుకోవాల్సిన గురుదర బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ హ్యాండీక్రాప్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నాయుడు సత్యనా రాయణ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గోల్కొండ క్రాఫ ట్స్ అండ్ టెక్స్టైల్స్ మేళాను ఆయన నాబార్డు సిజిఎం బి. ఉదయభాస్కర్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ కల బతకాలంటే కళాకారులు బతకాలన్నారు. నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ మాట్లాడు తూ హస్తకలను ప్రోత్సహించేందుకు నాబార్డు పక్షాన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఓఎస్డి ఎస్‌ఎం భాష, కెవిఎస్ నాగేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.