calender_icon.png 29 September, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో శాంతియుతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి

29-09-2025 12:00:00 AM

  1. సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలనలో

ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, సెప్టెంబర్ 28(విజయ క్రాంతి) పెద్దపల్లి లో శాంతియుతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరామణరావు అన్నారు. పెద్దప ల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద సోమవారం బతుకమ్మ వేడుకలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ ఆడే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూతెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, సద్దుల బతుకమ్మ పండగలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పా ట్లు చేయాలను అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో స్థలాలు చదును చేయడం, లైటింగ్, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు.

మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. పండుగల సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ ఎ.ఈ, వ్యవసా య మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.