calender_icon.png 10 September, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మకుంటను అందంగా తీర్చిదిద్దాలి

05-09-2025 12:22:37 AM

జనగామ, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : గురువారం బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ లు కలిసి సంబంధిత అధికారులతో బతుకమ్మ కుంట పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా బతుకమ్మ కుంట లో  అందమైన రంగుల తో ఏర్పాటు చేసిన గ్రిల్స్ ను, సందర్శకులకు ఏర్పాటు చేసిన బెంచ్ లను పరిశీలించారు.  వాకింగ్ ట్రాక్ పనులు త్వరితగతన పూర్తి చేయాలన్నారు. వాచ్ టవర్స్, ఐ లవ్ జనగామ బ్యూటీఫికేషన్ పనులను పరిశీలిస్తూ చూపరులకు ఆకర్షణీయంగా కనిపించాలన్నారు.

చిల్డ్రన్ పార్క్ ను సందర్శిస్తూ పనులను వేగవంతంగా చేపట్టాలని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లైటింగ్ పనులను పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే రీతిలో పనులన్నీ చేపట్టి అందుబాటులోకి తేవాలన్నారు. పార్కులో ఏర్పాటు చేయనున్న మొక్కల పై సంబంధిత ఉద్యాన శాఖ అధికారితో మాట్లాడుతూ ఎర్ర మట్టి పోయించాలని అనంతరం మొక్కలు నాటింపచేయాలన్నారు.

నీటి శుభ్రతను పరిశీలిస్తూ తీసుకోవలసిన చర్యలను ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ తదితరులు ఉన్నారు.