10-09-2025 09:26:39 AM
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ
ముత్తారం,(విజయక్రాంతి): రేపు ముత్తారం మండలంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి శ్రీధర్ బాబు మండల లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని, మండలంలోని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అధిక సంఖ్యలో హాజరు కాాలని బాలాజీ కోరారు.