calender_icon.png 10 September, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు

10-09-2025 09:36:42 AM

హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో(Peasant struggle) కీలక పాత్ర పోషించిన చాకలి(చిట్యాల) ఐలమ్మ (Chakali Ilamma) తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక ఐలమ్మ, భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు.